ఎన్టీఆర్ రుణం తీర్చుకుంటా...హరీష్!

ఎన్టీఆర్ రుణం తీర్చుకుంటా...హరీష్!
x
Highlights

మంచి మాస్ ఎలిమెంట్స్ ని కలగలిపి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయడంలో హరీష్ శంకర్ ఆరితేరిన దర్శకుడు..ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పూజ హెగ్దే హీరోయిన్ గా వాల్మీకి అనే సినిమా తెరకెక్కింది.

మంచి మాస్ ఎలిమెంట్స్ ని కలగలిపి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయడంలో హరీష్ శంకర్ ఆరితేరిన దర్శకుడు..ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పూజ హెగ్దే హీరోయిన్ గా వాల్మీకి అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా గడిపేస్తుంది. అందులో భాగంగానే దర్శకుడు ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి సంభోదించాడు...

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రామయ్య వస్తావయ్యా అనే సినిమా తెరకెక్కింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనిపై హరీష్ మాట్లాడుతూ నాకు నచ్చే యంగ్ హీరోస్ లో ఎన్టీఆర్ ఒకరు. గబ్బర్ సింగ్ హిట్టు తర్వాత నాకు ఆయన మంచి ఆఫర్ ఇచ్చాడు కానీ దానిని నేను నిలబెట్టుకోలేకపోయాను. అప్పటి నుండి ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఆయనతో మరో హిట్టు కొట్టి ఆయన రుణం తీర్చుకుంటానని ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు హరీష్ వెల్లడించాడు...


Show Full Article
Print Article
More On
Next Story
More Stories