కావాలని చేయలేదు.. నిజంగానే మర్చిపోయాను!

కావాలని చేయలేదు.. నిజంగానే మర్చిపోయాను!
x
Anil Ravipudi File photo
Highlights

కందిరీగ, మసాలా, ఆగడు సినిమాలకి మాటల రచయితగా పనిచేసి పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి.

కందిరీగ, మసాలా, ఆగడు సినిమాలకి మాటల రచయితగా పనిచేసి పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి హీరో కం ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. చేసిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ సినిమాలతో హైట్రిక్ కొట్టాడు. ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో అనిల్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.

అందులో భాగంగానే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాని స్టార్ట్ చేసి కేవలం అయిదు నెలలోనే కంప్లీట్ చేసి ఆరో నెలలో సినిమాని విడుదలకి సిద్ధం చేసాడు. ఈ సినిమాని సంక్రాంతికి కానుకగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరును పెంచేసింది. అందులో భాగంగానే గత రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి సినిమాని సపోర్ట్ చేశారు.

అయితే ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. సినిమాని గురించి చెప్పుకొచ్చారు, ఇక స్పీచ్ చివరిలో ఈ సంక్రాంతికి విడుదలవుతున్న బన్నీ అల వైకుంఠపురములో సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. చిరు అలా మాట్లాడుతున్న సమయంలో అనిల్ రావిపూడి రజినీకాంత్ దర్బార్ సినిమాని చెప్పాడు . అక్కడ తన తొలి హీరో కల్యాణ్‌రామ్‌ సినిమా ఎంత మంచివాడువురా సినిమా పేరును చెప్పడం మర్చిపోయారు.

దీనితో అనిల్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. " వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నిన్న నాకు చాలా ఎమోషనల్‌ డే. సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్‌ వేడుకతో చాలా సంతోషానికి లోనయ్యాను. దీంతో నా మొదటి హీరో, నిర్మాత కల్యాణ్‌రామ్‌ పేరును వేడుకలో చెప్పడం మర్చిపోయాను. అది ఉద్దేశపూర్వకంగా కాదు, నిజంగానే మర్చిపోయాను. "ఎంతమంచి వాడువురా' చిత్రం ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అనిల్‌ రావిపూడి పేర్కొన్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో మహేష్ ఈ సినిమాని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. విజయశాంతి, సంగీత, రాజేంద్రప్రసాద్, సంగీత ముఖ్యపాత్రలలో నటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories