logo
సినిమా

అనిల్ రావిపూడి అరెస్ట్!

అనిల్ రావిపూడి అరెస్ట్!
X
Highlights

ఈ సంక్రాంతికి సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది అనిల్ రావిపూడినే 'ఎఫ్‌2' తో...

ఈ సంక్రాంతికి సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది అనిల్ రావిపూడినే 'ఎఫ్‌2' తో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కెరీర్ కు మంచి బేస్ సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే అనిల్.. ప్రస్తుతం అందులో తెగ హల్చల్ చేస్తున్నాడు.

అనిల్ రావిపూడిని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అరెస్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓ పిక్ వైరల్ అవుతోంది. వరుణ్ తేజ్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతికి బేడీలు వేస్తున్నట్లుగా దిగిన పిక్ షేర్ చేశారు. దీనిపై 'థియేటర్లలో కడుపుబ్బా నవ్విస్తున్నందుకు అరెస్ట్ చేస్తున్నా' అని కాప్షన్ ఇచ్చి ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు వరుణ్. అంతే అది కాస్త వైరల్ గా మారింది.

ఇక ప్రేక్షకులకు వినోదాల విందునిస్తూ.. నిర్మాతలకు లాభాల పంట పండించడమే కాకుండా అగ్రహీరో వెంకటేష్, యువహీరో వరుణ్ తేజ్ లకు కూడా భారీ ఊరటను ఇచ్చింది. చిత్రంలో తమన్నా, మెహ్రీన్ అందాలతో యువకుల హృదయాలను కొల్లగొట్టారు.

Next Story