pawan kalyan : పింక్ సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

pawan kalyan : పింక్ సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
x
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా ఆమితాబ్ బచ్చన్ నటించిన పింక్ మూవీకి రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా ఆమితాబ్ బచ్చన్ నటించిన పింక్ మూవీకి రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తున్నారు . వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నివేతా థామస్, అంజలి , అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన ఈ చిత్రం శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి 'లాయర్ సాబ్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపైన చిత్ర నిర్మాత దిల్ రాజు స్పందించారు.

తాజాగా అయన నిర్మాణంలో తెరకెక్కిన జాను సినిమా ప్రమోషన్ లో భాగంగా అయన ఈ సినిమాపైన స్పందించారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాని మేము డిస్ట్రిబ్యూషన్ చేశాం.. అప్పటినుంచి అయనతో సినిమా తీయాలని అనుకుంటున్నాము. కానీ ఆ ఛాన్స్ ఇప్పటికి దొరికిందని అన్నారు. ఇక సినిమా టైటిల్ పైన స్పందిస్తూ.. ఇంకా ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ అనుకోలేదని ఉగాది సందర్భంగా సినిమాకి సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేస్తామని అయన వెల్లడించారు. చిత్ర నిర్మాత టైటిల్ పై క్లారిటీ ఇవ్వడంతో అది ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అన్న విషయం అర్ధం అయిపొయింది. ఇక ఈ సినిమాని గబ్బర్ సింగ్ సినిమా రిలీజైన మే లోనే రిలీజ్ చేస్తామని దిల్ రాజు వెల్లడించారు.

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలని లైన్ లో పెట్టారు. అందులో క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాని మొదలు పెట్టాడు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమాని చేయనున్నాడు పవన్.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories