రాజుగారికి మెంటలా అన్నారట!

రాజుగారికి మెంటలా అన్నారట!
x
Highlights

రామానాయుడు, ఎంఎస్ రాజుల తర్వాత సినిమా కథలని కరెక్ట్ గా జడ్జ్ చేసి హిట్ కొట్టే నిర్మాతలలో దిల్ రాజు ఆ తర్వాతి స్థానాలలో ఉంటారు.

రామానాయుడు, ఎంఎస్ రాజుల తర్వాత సినిమా కథలని కరెక్ట్ గా జడ్జ్ చేసి హిట్ కొట్టే నిర్మాతలలో దిల్ రాజు ఆ తర్వాతి స్థానాలలో ఉంటారు. తక్కువ బడ్జెట్ తో సినిమాలని తెరకెక్కించి భారీ హిట్ లను చూశారు దిల్ రాజు.. ఇప్పుడు అయన ప్రొడక్షన్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే భారీ అంచనాలని కలగజేస్తున్నాయి. తాజాగా అయన సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న జాను సినిమాని ఫిబ్రవరి 07 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

తమిళ్ లో మంచి హిట్ అయిన 96 సినిమాకి ఇది రీమేక్ .. అక్కడ ఈ సినిమాలో త్రిష, విజయ్‌ సేతుపతి కలిసి నటించారు. 2018 లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్టయింది. ముఖ్యంగా ప్రేమికులకి ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోయింది. స్కూల్ డేస్‌లో ప్రేమలో పడ్డ హీరో, హీరోయిన్లు ఇద్దరు ఆ తర్వాత కొన్ని కారణాలతో విడిపోవాల్సి వస్తుంది. ఇలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తారు. అప్పుడు వీరిద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మళ్ళీ వీరు కలిశారా లేదా అన్న నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. భారీ విజయాన్ని అందుకోవడమే కాదు ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. గోవింద వసంత సంగీతమందిస్తున్నాడు. సీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా సినిమాకి సంభందించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లడుతూ.. " బేసిక్ గా నేను రీమేక్ సినిమాలని చేయను.. కానీ 96 చిత్రాన్ని విడుదల కంటే ముందే చెన్నైలో ప్రివ్యూ థియేటర్ లో చూశాను. అప్పుడు ఈ సినిమాని రీమేక్ చేయాలనీ ఫిక్స్ అయ్యాను. సినిమాని చూస్తున్నంత సేపు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అదే అనుభూతిని తెలుగు ప్రేక్షకులు కూడా ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని రీమెక్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే 96 సినిమా రీమేక్ గురించి ప్రకటించినప్పుడు దిల్ రాజుకేమైనా మెంటలా? ఎందుకు క్లాసిక్ ను టచ్ చేస్తున్నాడు అని చాలా మంది అన్నారు. ఇక సినిమా చూసాకా మాత్రం కచ్చితంగా నేను ఫీల్ అయిన అనుభూతిని ఫీల్ అవుతారని దిల్ రాజు చెప్పుకొచ్చారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories