నాగ్ పక్కన ఫేడవుట్ హీరోయిన్!

నాగ్ పక్కన ఫేడవుట్ హీరోయిన్!
x
Highlights

మన్మధుడు 2 లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత నాగార్జున చేస్తున్న చిత్రం 'వైల్డ్ డాగ్'. ఎలాంటి హడావుడి లేకుండా సినిమాని మొదలుపెట్టాడు నాగ్.

మన్మధుడు 2 లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత నాగార్జున చేస్తున్న చిత్రం 'వైల్డ్ డాగ్'. ఎలాంటి హడావుడి లేకుండా సినిమాని మొదలుపెట్టాడు నాగ్. అంతేకాకుండా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో నాగ్ పక్కన నటించే హీరోయిన్ ఎవరన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ నాగ్ సరసన బాలీవుడ్ భామ దియా మీర్జాని ఒకే చేశారు.

దియా మిర్జా పక్కా హైదరాబాదు అమ్మాయి. కానీ ముంబైలో సెటిల్ అయి బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది .. ఇటీవల తన భర్తకు విడాకులు ఇచ్చేసి సినిమాలపైన ఎక్కువగా ఫోకస్ చేసూకుంటూ వచ్చింది. ఈ సినిమాలో మంచి పాత్ర ఉండడం, నాగ్ పక్కన ఆమె బాగా సూట్ కావడంతో దియా మీర్జాను తీసుకున్నారు. అయితే ఆమెకి సంబంధించిన షూట్ ని ప్రస్తుతం చిత్రికరిస్తున్నట్టుగా సమాచారం..

ఈ సినిమాలో నాగ్ ఎన్ఐఎ అధికారిగా కనిపిస్తున్నాడు. గగనం సినిమా తరవాత మళ్లీ నాగ్ కాస్త డిఫరెంట్ సినిమా చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉపిరి. మహర్షి లాంటి సినిమాలకి రైటర్ గా పనిచేసిన సోలోమాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాతో పాటు నాగ్ మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు సినిమాని తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇందులో నాగర్జునతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పట్టలేక్కనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories