రౌడీ బేబీ పాట మరో రికార్డు..

రౌడీ బేబీ పాట మరో రికార్డు..
x
Highlights

సాయిపల్లవి.... చేసిన సినిమాలు కొన్ని అయినప్పటికీ చాలా పాపులారిటీని సంపాదించుకుంది.

సాయిపల్లవి.... చేసిన సినిమాలు కొన్ని అయినప్పటికీ చాలా పాపులారిటీని సంపాదించుకుంది. ఇక హీరోలతో సమానంగా డాన్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక సాయిపల్లవి ధనుష్ జంటగా నటించిన చిత్రం మారి 2.. ఇందులోని రౌడీ బేబీ పాట ఎంత పెద్ద హిట్టు అయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇటు ఆడియోకి గాను అటు వీడియోకి గాను ప్రేక్షకులను ఈ పాట బాగా ఆకట్టుకుంది.

యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటకి ప్రభుదేవా కోరియోగ్రఫీ చేశారు.. ఈ పాట వరల్డ్ వైడ్ సాంగ్ లో చరిత్ర సృష్టిస్తుంది. 2019, జనవరి 2వ తేదీన యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ పాటని ఇప్పటి వరకు 80 కోట్లకి పైబ‌డి వీక్షించారు. 3 మిలియ‌న్స్‌కి పైగా లైక్ చేశారు.

ఇక ఇది ఇలా ఉంటే సాయి పల్లవి గత సినిమాలలోని పాటలు కూడా యుట్యూబ్ లో మంచి రికార్డులను సృష్టించాయి.. ఫిదా సినిమా నుండి వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే సాంగ్, ఎంసీఏ చిత్రం నుండి మై డియర్ నాని పాటలు అత్యదిక వ్యూస్ ని రాబట్టి రికార్డులను నెలకొల్పాయి.

ఇక ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ అనే సినిమాలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వేసవిలో ప్రేక్షకల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories