కొరటాల దేవిని వదిలేశాడా ?

కొరటాల దేవిని వదిలేశాడా ?
x
Highlights

మంచి కాంబినేషన్ అని ఓ మార్క్ పడిపోతే చాలు.. అదే కాంబినేషన్ ఎక్కువగా రిపేట్ చేసేందుకు ఇష్టపడతాడు.. అందులో మన టాలీవుడ్ కి సెంటిమెంట్స్ ఎక్కువ.. అందులో...

మంచి కాంబినేషన్ అని ఓ మార్క్ పడిపోతే చాలు.. అదే కాంబినేషన్ ఎక్కువగా రిపేట్ చేసేందుకు ఇష్టపడతాడు.. అందులో మన టాలీవుడ్ కి సెంటిమెంట్స్ ఎక్కువ.. అందులో భాగంగానే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని కొందరు దర్శకులు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. అందులో కొరటాల శివ ఒకరు..

ఇప్పటి వరకు వీరి కలిసి చేసిన నాలుగు సినిమాలు మంచి హిట్టు అయ్యాయి. గుడ్ కాంబినేషన్ ని అందరు మైండ్ లో ఫిక్స్ అయ్యారు. కొరటాల అన్ని సినిమాలకి ఇక దేవినే మ్యూజిక్ చేస్తాడని అందరు భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు దేవిని కొరటాల పక్కన పెట్టాడన్న ఓ వార్త కోడై కుస్తుంది. వాస్తవానికి ఇందులో నిజం లేకపోలేదు.

ఎందుకంటే చిరంజీవి , కొరటాల సినిమా దసరా సందర్భంగా నిన్న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. సినిమాకి సంబంధించిన కొంతమంది టేక్నిషన్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో దేవి పేరు మాత్రం లేదు. అయితే తాజా సమచారం ప్రకారం సైరా సినిమాకి మ్యూజిక్ చేసిన అమిత్ త్రివేదిని ఈ సినిమాకి కూడా కంటిన్యూ చేయాలనీ అనుకుంటున్నారట.. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఆఫీషల్ గా ఓ ప్రకటన చేయాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories