మహేష్, అనిల్ రావిపూడి సినిమాకి దేవీ మ్యూజిక్?

మహేష్, అనిల్ రావిపూడి సినిమాకి దేవీ మ్యూజిక్?
x
Highlights

మహర్షి విజయంతో జోష్ లో ఉన్న మహేష్ బాబు, F2 విజయంతో ఊపు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మహేష్ 26 వ సినిమా రెడీ కానుంది. ఈ సినిమాకి స్క్రిప్ట్...

మహర్షి విజయంతో జోష్ లో ఉన్న మహేష్ బాబు, F2 విజయంతో ఊపు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మహేష్ 26 వ సినిమా రెడీ కానుంది. ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ పూర్తిఅయిపోయింది. ఇక సెట్స్ మీదకు వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చక చకా పూర్తయిపోతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించడానికి ఈ నెల 31 వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమా కు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి F2 , మహేష్ మహర్షి సినిమాలకు సంగీతాన్నందించిన దేవీ పేరునే ఈ సినిమాకి ఖరారు చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ రెండు సినిమాలు మ్యూజికల్ హిట్లే. ఇపుడు ఈ సినిమా కూడా వాటి వరుసలోకి వెలుతుందేమో చూడాలి.




Show Full Article
Print Article
Next Story
More Stories