బన్నీ ట్వీట్ పై వార్నర్ రియాక్షన్ ఇదే!

బన్నీ ట్వీట్ పై వార్నర్ రియాక్షన్ ఇదే!
x
David warner, Alluarjun(File photo)
Highlights

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మైదానంలోనే కాదు. టిక్ టాక్ లో కూడా రెచ్చిపోతున్నాడు.

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మైదానంలోనే కాదు. టిక్ టాక్ లో కూడా రెచ్చిపోతున్నాడు. టాలీవుడ్ లోని పాటలకు, డైలాగ్స్ పైన టిక్ టాక్ లను చేస్తూ అందరి చేత శభాష్ అనిపిస్తున్నాడు. మహేష్ బాబు , అల్లుఅర్జున్ సినిమాలలోని పాటలకి, డాన్స్ లతో అలరిస్తున్నాడు.

తాజాగా అల వైకుంఠపురములో చిత్రంలోని రాములో రాములా అనే పాటకి భార్యతో కలిసి స్టెప్స్ వేశాడు వార్నర్.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అయితే వార్నర్ వీడియో పైన హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మరో అతిపెద్ద సర్‌ప్రైజ్. మరోసారి ధన్యవాదాలు సర్. చించేశారు` అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.

అయితే బన్నీ ట్వీట్ పైన వార్నర్ స్పందించాడు. ఏదో నా వంతు ప్రయత్నం చేశాను. నాకు ఆ పాట, డ్యాన్స్ చాలా నచ్చాయని రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లును ఆకట్టుకుంటుంది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories