దర్జాగా రజినీ 'దర్బార్' ట్రైలర్

దర్జాగా రజినీ దర్బార్ ట్రైలర్
x
Darbar Trailer
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం దర్బార్.. ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా...

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం దర్బార్.. ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు ". వాడు పోలీస్ ఆఫీసరా సర్..హంతకుడు" ని బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ ట్రైలర్ మొదలవుతుంది. ట్రైలర్ లో రజినీ స్టైల్ అదిరిపోయింది.

ఇక రజినీ చెప్పే పంచ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. 'సర్ వాళ్లకు చెప్పండి.. పోలిసుల దగ్గరకి రైట్ లో రావచ్చు.. లెఫ్ట్ లో రావచ్చు.. కానీ స్ట్రైట్ గా రావద్దని' 'ఒరిజినల్ గానే విలన్నమ్మా' . అంటూ రజినీ చెప్పే డైలాగ్స్ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక నయనతార చాలా అందంగా కనిపించింది. సినిమా ట్రైలర్ ని బట్టి చూస్తే కథ ముంబై చూట్టూ తిరుగుతుందని అర్ధం అవుతుంది.

సినిమా రజినీ వన్ మ్యాన్ షో లాగే నడిచేలా కనిపిస్తుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. చాలా సినిమాల తర్వాత ఇందులో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. జనవరి 9 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories