దబంగ్ 3 సినిమా రివ్యూ

దబంగ్ 3 సినిమా  రివ్యూ
x
Highlights

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంతకముందు 'దబంగ్', 'దబంగ్ 2' చిత్రాల్లో పోలీస్ పాత్రలో నటించి చాల మంది అభిమానులను సంపాదించుకున్నాడు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంతకముందు 'దబంగ్', 'దబంగ్ 2' చిత్రాల్లో పోలీస్ పాత్రలో నటించి చాల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయన తాజాగా 'దబాంగ్' సిరీస్ చేస్తున్న విషయం మనకి తెలిసిందే. అందులో భాగంగా ఇపుడు 'దబాంగ్ 3' చిత్రంలో మరోసారి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మొదటి రెండు సిరీసుల్లాగే 'దబాంగ్ 3' చిత్రంలో లవ్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, నిండుగా ఉంటాయని చిత్రబృందం ప్రమోషన్స్ లో ప్రకటించింది. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'దబంగ్', 'దబంగ్ 2' చిత్రాల్లో చుల్ బుల్ పాండేగా ఎలా మారాడో తెలియజేసే కథతో 'దబాంగ్ 3' సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో చుల్ బుల్ పాండే విలన్స్ పై ఎలా పోరాటం చేసాడు? ఖుషి ప్రేమని ఎలా దూరం చేసుకున్నాడు? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాని తప్పకుండా చుడాలిసిందే..

కథ :

చుల్ బుల్ పాండే (సల్మాన్ ఖాన్) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. తన భార్య రోజా (సోనాక్షి సిన్హా ), సోదరుడు మక్కి (అర్భాజ్ ఖాన్ )తో ఎంత సరదాగా జీవితాన్ని గడుపుతారో అన్నదే కధాంశం. ఇలా ఉండగా ఒక రోజు సల్మాన్ ఖాన్ తన డ్యూటీలో భాగంగా వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసి ఎంతోమంది ఆడవాళ్ళను రక్షిస్తాడు. ఈ విషయం ధనవంతుడు అయిన బల్లి (సుదీప్) కు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ వారిని ఎలా ఎదుర్కొన్నాడో అన్నది తెలుసుకోవాలంటే వెండితెరపై చుడండి..

ఎలా ఉందంటే :

'దబంగ్', 'దబంగ్ 2' సినిమాల్లో లాగే ఈ సినిమాలో ఆక్షన్ సీన్స్ కి కొదవ లేకుండా దర్శకుడు తగిన జాగ్గ్రతలు తీసుకున్నాడు . ఇక హీరొయిన్ సోనాక్షి తన పాత్రకి తగిన న్యాయం చేసింది. మిగితా నాటీ నటులు తమ పాత్రకు న్యాయం చేసారు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానానికి సంభిందించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories