వైరల్ న్యూస్ : త్రివిక్రమ్ దర్శకత్వంలో బాలయ్య, ఎన్టీఆర్

వైరల్ న్యూస్ : త్రివిక్రమ్ దర్శకత్వంలో బాలయ్య, ఎన్టీఆర్
x
Highlights

తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకే స్క్రీన్ పై ఇద్దరు హీరోలు కనిపించడం అభిమానులని ఆనందంగా...

తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకే స్క్రీన్ పై ఇద్దరు హీరోలు కనిపించడం అభిమానులని ఆనందంగా ఉంటుంది. ఇక అదే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఇక ఆ ఊహకి అవధులు ఉండవనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాని ఊపేస్తుంది. అదే బాలకృష్ణ ఎన్టీఆర్ కలిసి నటించడం..

నందమూరి హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అభిమానులు, దర్శకులు చాలా మంది అనుకున్నారు. కానీ దానికి తగ్గ కథ దొరకలేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాలో బాలకృష్ణ నటిస్తారని తెలుస్తోంది. బాలయ్య , ఎన్టీఆర్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించాలని దర్శకుడు త్రివిక్రమ్ అనుకుంటున్నాడని, దానికి తగ్గట్టుగానే పూర్తి కథని సిద్దం చేస్తున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక గతేడాది ఎన్టీఆర్ బయోపిక్‌లో కళ్యాణ్ రామ్‌తో కలిసి నటించాడు బాలయ్య. ఇక బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఒకే ఫ్రేమ్ లో ఎప్పుడు కనిపిస్తారా అని నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టాడు త్రివిక్రమ్.. ప్రస్తుతం సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమాని పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకి 'అయననూ పోయిరావలే' హస్తినకు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ లో ఉన్న తారక్ ఆ తర్వాత ఈ సినిమాకి షిఫ్ట్ కానున్నాడు. గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ చిత్రం వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక బాలకృష్ణ రూలర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ నుంచి సినిమా వస్తుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నాడని, పొలిటికల్ బ్యాక్ గ్రప్ లో ఈ సినిమా తెరకేక్కుతుందని సమాచారం. ఇందులో బాలయ్య సరసన కేథరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories