బిగ్ బాస్ 3 ఆపలేం..కోర్టు స్పష్టీకరణ!

బిగ్ బాస్ 3 ఆపలేం..కోర్టు స్పష్టీకరణ!
x
Highlights

బిగ్ బాస్ అనైతికమంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. టీవీ షోలు భావ ప్రకటనా స్వేచ్చకీ సంబంధించినవనీ, వాటిపై జోక్యం చేసుకోలేమనీ స్పష్టం చేసింది....

బిగ్ బాస్ అనైతికమంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. టీవీ షోలు భావ ప్రకటనా స్వేచ్చకీ సంబంధించినవనీ, వాటిపై జోక్యం చేసుకోలేమనీ స్పష్టం చేసింది. సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి తన పిటిషన్ లో బిగ్ బాస్ అనైతిక కార్యక్రమమనీ, హౌస్ లో జరిగే అంశాలనుఁ ఎటువంటి సెన్సార్ లేకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారనీ ఆ షో నిలుపుదల చేయాలనీ కోర్టును కోరారు. దీనిపై సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. పిల్లలు ఎటువంటి కార్యక్రమం చూడాలి అనే అంశం పూర్తిగా తల్లిదండ్రులకు సంబంధించినదనీ, వారే పిల్లలను అదుపుచేసుకోవాల్సి ఉంటుందనీ కోర్టు అభిప్రాయపడింది. ఒక వేళ షో లో అభ్యంతరకర, అనైతిక అంశాలు ఉంటె వాటిని ట్రాయ్ కి ఫిర్యాదు చేయొచ్చని పిటిషన్ దారుకు కోర్టు సూచించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories