కరోనాతో ప్రముఖ సింగర్ మృతి

కరోనాతో ప్రముఖ సింగర్ మృతి
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రముఖ అమెరికన్‌ సింగర్‌ జో డిఫీని కరోనా బలితీసుకుంది. ఆయన వయసు 61 ఏండ్లు. 1990 దశకంలో జో డిఫీ...

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రముఖ అమెరికన్‌ సింగర్‌ జో డిఫీని కరోనా బలితీసుకుంది. ఆయన వయసు 61 ఏండ్లు. 1990 దశకంలో జో డిఫీ అమెరికన్‌ జానపద సంగీతాన్ని ప్రపంచస్తాయికి తీసుకెళ్లారు. సంగీత ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డులుగా భావించే గ్రామీ అవార్డులు కూడా ఆయన గెలుచుకున్నారు.

తనకు కోవిడ్ సోకినట్టు జో డిఫీ రెండు రోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. పికప్ మ్యాన్, ప్రాప్ మీ ఆఫ్ బిసైడ్ ద జూక్‌బాక్స్, జాన్ డీర్ గ్రీన్ వంటి పాటలు ఆయనను ప్రపంచానికి పరిచయం చేశాయి. తన పాటలతో 90లలో అమెరికన్ సమాజాన్ని ఉర్రూతలూగించారు. గ్రామీ అవార్డులను కూడా పలుమార్లు జో అందుకున్నారు.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories