కరోనా ఎఫెక్ట్ : నిఖిల్ పెళ్లి వాయిదా

కరోనా ఎఫెక్ట్ : నిఖిల్ పెళ్లి వాయిదా
x
Nikhil (File Photo)
Highlights

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే యువ కథానాయకుడు నిఖిల్ పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే..

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే యువ కథానాయకుడు నిఖిల్ పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మరో హీరో నిఖిల్‌ పెళ్లి కూడా వాయిదా పడింది. గత కొద్ది రోజులుగా నిఖిల్ పెళ్లి వాయిదా పడనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన నిఖిల్ స్పందిస్తూ.. కరోనానే కాదు.. నా పెళ్లిని ఏదీ ఆపలేదని, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మేం గుడిలోనైనా వివాహం చేసుకుంటాం. నా వివాహాన్ని వాయిదా వేయడం నాకిష్టం లేదని నిఖిల్ చెప్పుకొచ్చారు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవ్ కదా! దీనితో తన వివాహాన్ని వాయిదా వేసుకోక తప్పలేదు నిఖిల్‌కి...

ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెళ్లి జరగడం కష్టమని, అందుకే వాయిదా వేస్తున్నానని నిఖిల్ వెల్లడించాడు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తానని చెప్పారు. నిఖిల్‌ భీమవరంకు చెందిన వైద్యురాలు పల్లవిని వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక ఏప్రిల్‌ 16న వివాహం నిశ్చయించారు. గత కొన్ని రోజులుగా నిఖిల్‌, పల్లవి ప్రేమలో ఉన్నారు. నిఖిల్‌ ఆమెను గోవా తీసుకెళ్లి.. అక్కడ తన ప్రేమను చెప్పారు. ఆ తర్వాత పెద్దల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది.

నిఖిల్‌ ప్రస్తుతం కార్తికేయ 2 తో పాటుగా సుకుమార్ రచనలో, పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న "18 పేజీస్" సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్.. ఇక కరోనా వైరస్‌ నియంత్రణకై పోరాడుతున్న వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి నిఖిల్ అండగా నిలుస్తున్నారు. వారికోసం శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లను అందజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories