చిరు ట్వీట్ : మోహన్ బాబు ... నో హగ్స్‌.. నో షేక్‌ హ్యాండ్స్‌.. ఓన్లీ నమస్కారమ్స్

చిరు ట్వీట్ : మోహన్ బాబు ... నో హగ్స్‌.. నో షేక్‌ హ్యాండ్స్‌.. ఓన్లీ నమస్కారమ్స్
x
Chiranjeevi and Mohan Babu (File Photo)
Highlights

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఉగాది సందర్భంగా సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే..

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఉగాది సందర్భంగా సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా వాయిదా పడడంతో చిరంజీవి ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక చిరంజీవికి అభిమానులతో పాటు, సినీ తారలు కూడా చిరంజీవికి స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తన సహ నటుడు అయిన మంచు మోహన్ బాబు 'స్వాగతం మిత్రమా' అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. "థాంక్యూ మిత్రమా రాననుకున్నావా... రాలేననుకున్నావా" అంటూ ఇంద్ర సినిమాలోని డైలాగ్ తో రీట్వీట్ చేశారు.

అయితే దీనిపై మోహన్ బాబు తాజాగా స్పందించారు. ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను అంటూ సరదాగా మరో ట్వీట్ చేశారు. దీనిపై మరోసారి చిరంజీవి స్పాంటేనియస్ గా స్పందించారు. "మిత్రమా...కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి.. నో హగ్స్, నో షేక్ హాండ్స్...ఓన్లీ నమస్తే... కరోనా వైరస్ పై అవగాహన కోసమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వారిని ఎలా కాపాడాలో తెలియాలంటే మంచు లక్ష్మి రూపొందించిన వీడియోని చూడాలని మోహన్ బాబు కోరారు చిరంజీవి..

వీరిద్దరి మధ్య సరదాగా సాగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాలు నడుస్తున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఎక్కడ చూసినా వీరిద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని మేము మంచి మిత్రుల మని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఇక మోహన్ బాబు సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఆకాశమే నీ హద్దు రా అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories