సునీల్ అనుకున్న రూట్ కే వచ్చాడు.. మరి వర్కౌట్ అవుతుందా?

సునీల్ అనుకున్న రూట్ కే వచ్చాడు.. మరి వర్కౌట్ అవుతుందా?
x
Sunil (file photo)
Highlights

కమెడియన్ గా మంచి సక్సెస్ అయ్యాడు సునీల్.. కమెడియన్ గా ఓ రేంజ్ లో ఉన్నప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సునీల్..

కమెడియన్ గా మంచి సక్సెస్ అయ్యాడు సునీల్.. కమెడియన్ గా ఓ రేంజ్ లో ఉన్నప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సునీల్.. అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు, భీమవరం బుల్లోడు సినిమాలు మంచి హిట్టు అయ్యాయి. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. హీరోగా సునీల్ కి అవకాశాలు తక్కువ కావడంతో మళ్లీ కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. అరవింద సమేత వీర రాఘవ, చిత్రలహరి సినిమాలో కమెడియన్ గా నటించి మెప్పించాడు.

ఇప్పుడు కమెడియన్ నుంచి విలన్ రోల్ కి షిఫ్ట్ అయ్యాడు. మజిలీ, డియర్ కామ్రేడ్ ప్రతిరోజూ పండగే, విజేత వంటి చిత్రాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ 'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. షార్ట్ ఫిల్మ్ ఫేం చాందిని చౌదరీ హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నిన్న అధికారికంగా ప్రకటించింది.

అయితే విలన్ గా నటించడం సునీల్ చిరకాల కోరిక అనే చెప్పాలి. ఎందుకంటే సునీల్ ఇండస్ట్రీకి వచ్చింది విలన్ అవుదామని.. అందులో భాగంగానే తేజ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ సర్కస్ సినిమాలో చిన్నగా విలన్ గా నటించాడు సునీల్.. ఆ తర్వాత విలన్ పాత్రలు రాకపోవడం, కమెడియన్ గా సునీల్ కి మంచి పేరు రావడంతో మళ్లీ విలన్ గా నటించలేదు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో విలన్ గా కనిపించనున్నాడు. మరి ఇది సునీల్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నది చూడాలి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories