నటి, దర్శకురాలు విజయనిర్మల మృతిపై సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం..

నటి, దర్శకురాలు విజయనిర్మల మృతిపై సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం..
x
Highlights

వెండితెర దిగ్గజం సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఇక శెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించి, అత్యధిక చిత్రాల్ని...

వెండితెర దిగ్గజం సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఇక శెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించి, అత్యధిక చిత్రాల్ని తెరకెక్కించిన ఉమెన్ గా గిన్నిస్ బుక్ రికార్డు సైతం సొంతం చేసుకున్న విజయనిర్మల తిరిగిరాని లోకాలకు వెళ్లారు. విజయ నిర్మల మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. విజయ్ నిర్మల మృతి పట్ల ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల హఠాన్మరణం తీవ్ర దిగ్ర్భాంతికి చేసిందని చిరంజీవి అన్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో భానుమతి తర్వాత ఆ స్థాయిలో గర్వించదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల అని చిరంజీవి కొనియాడారు. విజయ నిర్మల ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తున్నాను అని బాల‌య్య అన్నారు. ఇక నితిన్‌, శ్రీను వైట్ల, ఈషా రెబ్బ‌, హ‌రీష్ శంక‌ర్, వెన్నెల కిషోర్, ద‌ర్శ‌కుడు మారుతి త‌దిత‌రులు విజ‌య నిర్మ‌ల మృతిప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు. ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ, కృష్ణ‌, న‌రేష్‌కి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నామ‌ని తెలిపారు.ఉదయం 10 గంటలకు నానక్‌రామ్‌గూడ నివాసానికి విజయనిర్మల భౌతికకాయం తరలించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్‌కు భౌతికకాయం తరలిస్తారు. రేపు ఫామ్‌ హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories