కోదండరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆ ముగ్గురి సందడి!

కోదండరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆ ముగ్గురి సందడి!
x
Highlights

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. వీరు ముగ్గురూ కల్సి ఒక చోట కనిపించడం అరుదు. అపుడెపుడో టాలీవుడ్ యాక్టర్ల క్రికెట్ పోటీల సందర్భంగా ఒకసారి ముగ్గురూ ఒక...

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. వీరు ముగ్గురూ కల్సి ఒక చోట కనిపించడం అరుదు. అపుడెపుడో టాలీవుడ్ యాక్టర్ల క్రికెట్ పోటీల సందర్భంగా ఒకసారి ముగ్గురూ ఒక దగ్గర కనిపించారు. మళ్ళీ ఇన్నాళ్ల తరువాత వీరు ఒకదగ్గర కల్సి సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి పుట్టినరోజు సోమవారం. చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ ముగ్గురూ ఈ సందర్భంగా జరిగిన వేడుకకు హాజరయ్యారు. కోదండరామిరెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ ముగ్గురు హీరోలు కలసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


కాగా, ఈ కార్యక్రమానికి ర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌ రాజు, అనిల్ సుంకర, ఎమ్మెస్ రాజు, దర్శకుడు బీ గోపాల్, కేఎల్ నారాయణ, ఎస్ గోపాల్‌ రెడ్డి, సంగీత దర్శకుడు కోటి తదితరులు కూడా హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories