Top
logo

చిరంజీవి చేతుల మీదుగా విశ్వ నటచక్రవర్తి విగ్రహావిష్కరణ

చిరంజీవి చేతుల మీదుగా విశ్వ నటచక్రవర్తి విగ్రహావిష్కరణ
Highlights

మెగాస్టార్‌ చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక...

మెగాస్టార్‌ చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లారు. హౌసింగ్‌ బోర్డు సెంటర్‌లో నెలకొల్పిన తొమ్మిది అడుగుల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించనున్నారు. చిరంజీవి రాక సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

చిరంజీవి అభిమానుల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ప్యాన్స్‌ నిరాశపడ్డారు.హనుమన్‌ జంక్షన్‌లో అంజయాంజనేయస్వామి గుడి దగ్గర అభిమానులను పలకరిస్తారని ఉత్సాహాంగా ఎదురు చూశారు. ఆయన కోసం నిరీక్షించిన అభిమానుల వైపు చూడకుండ వెళ్లిపోయారు. కారును ఆపేందుకు అభిమానులు ప్రయత్నించినా ఆపకుండా వెళ్లిపోయారని అభిమానులు నిరుత్సాహపడ్డారు.

Next Story