Top
logo

దాసరి లేని లోటు చిరు తీరుస్తున్నారా?

దాసరి లేని లోటు చిరు తీరుస్తున్నారా?చిరంజీవి (ఫైల్ ఫోటో)
Highlights

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిన్న పెద్ద సమస్య వచ్చిన అందరు దాసరి ఇంటి తలుపు తట్టేవారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిన్న పెద్ద సమస్య వచ్చిన అందరు దాసరి ఇంటి తలుపు తట్టేవారు.. గత ఏడాదిన్నర వరకు ఇండస్ట్రీలో ఎం జరిగిన అయన దగ్గరుండి చూసుకునేవారు. చిన్న హీరోల, పెద్ద హీరోల ఆడియో ఫంక్షన్స్ అయిన, మూవీ అసోసియేషన్ లో ఏమైనా ప్రోబ్లమ్స్ ఉన్న అయనే చూసుకునేవారు. ఇప్పుడు అయన ప్లేస్ ని భర్తీ చేసేది ఎవరు అనేదానికి మోహన్ బాబు, చిరంజీవి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

సీనియర్ నటులు కావడం, రాజకీయంగా కూడా అనుభవం ఉండడంతో వీరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఇందులో మోహ‌న్‌బాబు ఎక్కువ‌గా తిరుప‌తిలో త‌న విద్యాసంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌లో బిజీగా ఉంటూ, అడ‌పా ద‌డ‌పా హైద‌రాబాద్ వ‌స్తూ పోతున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవే పెద్ద దిక్కుగా మారారు. కానీ చిరంజీవి మాత్రం నినే ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోకుండా సినీ పెద్దలు కృష్ణంరాజు, మురళి మోహన్, మోహన్ బాబు లాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

ఇప్పుడు చిన్నహీరో , పెద్ద హీరో అని తేడా లేకుండా ఎవరు పిలిచినా వారి సినిమా ఆడియో ఫంక్షన్స్ కి వెళ్తున్నారు. సినిమాకి కావలసినంతగా సపోర్ట్ చేస్తున్నారు చిరు. ఇక తాజాగా మా డైరీ ఆవిష్కరణలో భాగంగా జరిగిన రచ్చలో కూడా చిరంజీవి చాలా హుందాగా వ్యవహరించారు. నిజానికి మాలో వివాదాలు ఎప్పటినుంచో వస్తున్నాయి. వాటి ప‌రిష్కారం కోసం మా అసోసియేషన్ కూడా చిరంజీవినే సంప్ర‌దిస్తూ వ‌స్తున్నారు. చిరంజీవి కూడా స‌ద‌రు స‌భ్యుల‌ను పిలిచి మాట్లాడుతూనే ఉన్నారు. దీనితో దాసరి లేని లోటును చిరంజీవి తీరుస్తున్నాడని పలువురు అనుకుంటున్నారు.

Web TitleChiranjeevi taking care about tollywood industry like dasari naranyana rao
Next Story


లైవ్ టీవి