megastar Chiranjeevi: కొరటాలకి చిరంజీవి డెడ్ లైన్

megastar Chiranjeevi: కొరటాలకి చిరంజీవి డెడ్ లైన్
x
Chiranjeevi , Koratala siva
Highlights

గతరాత్రి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల‌్బీ స్టేడియంలో అభిమానుల మధ్య ఘనంగా జరిగింది.

గతరాత్రి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల‌్బీ స్టేడియంలో అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ.. " కొన్ని నెలల క్రితం పేపర్ ని అలా తిరగేస్తుంటే మహేష్ బాబు ఫొటో కనిపించింది. ఆ ఫొటో కత్తిలా ఉంది. చాలా సేపు నా చూపును అలాగే కట్టిపడేశాడు. మిలట్రీ డ్రెస్‌లో. అది 'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ లుక్ .. వెంటనే మహేష్ కి ఫోన్ చేసి బాగుంది లుక్ అని చెప్పాను.

ఇక అది అయిపోయిన కొన్ని రోజులకే సార్ సినిమా అయిపొయింది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావాలని కోరాడు. నేను షాక్ అయ్యాను. అదేంటి సినిమా మొన్ననే కదా మొదలైంది అన్నాను. కేవలం అయిదు నెలలో సినిమాని కంప్లీట్ చేయడం నిజంగా గ్రేట్ మహేష్ లాగే మిగతా హీరోలు కూడా ఇలాగే సినిమాలు చేయాలనీ, దీనివల్ల నిర్మాతకి , ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని చిరు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తానూ కొరటాల శివతో సినిమాని చేస్తున్నాని, ఈ సినిమాని వంద రోజుల్లో పూర్తి చేస్తున్నాని చెప్పాడని, కొరటాల శివని స్టేజీపైకి పిలిచి వంద రోజుల్లో కాదు 99 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని అభిమానుల ముందు కొరటాలను ఒప్పించాడు చిరంజీవి. దీనికి కొరటాల కూడా ఒప్పుకున్నాడు. మరి చిరంజీవి పెట్టిన డెడ్ లైన్ లో కొరటాల సినిమాని కంప్లీట్ చేస్తాడా అన్నది చూడాలి .

విజయదశమి రోజు మొదలైన వీరి సినిమా తాజాగా కోకాపేట లో మొదలైంది. దేవాదాయ శాఖాలో పనిచేసే ఓ ఉద్యోగిగా చిరంజీవి ఇందులో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఫిక్స్ అయింది కానీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ , కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories