కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్ ..

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్ ..
x
Chiranjeevi, koratala siva (File photo)
Highlights

సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.

సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇది చిరంజీవికి 152వ సినిమా.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తోంది. విజయదశమి కానుకగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా కోకాపేటలో ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చిరు రెండు విభిన్నమైన పాత్రలలలో కనిపించనున్నారని, అందులో ఒకటి నక్సలైట్ కాగా మరొకటి దేవాదాయ శాఖాలో పనిచేసే అధికారిగా కనిపించనునట్టు సమాచారం.

అయితే అందులోని నక్సలైట్ గెటప్ లో ఉన్న చిరంజీవి లుక్ లీకైంది... ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఫోటోతో పాటు ఓ వీడియో కూడా లీక్ అయింది. అయితే దీనిపైన వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. వెంటనే సదరు వీడియోను ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి తొలిగించారు. అయితే ఫొటోల్ని మాత్రం తొలిగించడం వీళ్ల వల్ల కావడం లేదు. అప్పటికే ఫోటో సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపొయింది. అయితే ఈ స్టిల్ ఎవరు లీక్ చేశారు అన్నదానిపై చిత్ర యూనిట్ కి అంతుచిక్కడం లేదు..

సినిమా సెట్స్ పైన ఉండగానే లీకల లీక్ అవ్వడం తరుచుగా జరుగుతూనే ఉంది. గత ఏడాది చిరంజీవి నటించిన సైరా సినిమా కూడా సెట్స్ పై ఉండగానే లీకుల బారిన పడింది...తాజాగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా లీకుల బారిన పడింది. ఈ లీకుల బారిన పడకుండా చిత్ర బృందం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎదో విధంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ చిరు, కొరటాల సినిమాకి గోవిందా ఆచార్య అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దసరాకి సినిమాని రిలీజ్ చేయనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories