Top
logo

మోహన్ బాబుకి ముద్దు పెట్టిన చిరు

మోహన్ బాబుకి  ముద్దు పెట్టిన చిరు
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్‌ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది.

మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్‌ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో హీరో రాజశేఖర్ సంచలన వాఖ్యలు చేశారు. మా ప్రెసిండెంట్‌గా ఉన్న రాజశేఖర్, అధ్యక్షుడిగా ఉన్న నరేష్‌ల మధ్య గతంకొంతకాలంగా బహిరంగంగానే వార్ నడుస్తున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మరో సారి ఈ వివాదాలకి ఈ కార్యక్రమం వేదికైంది. డైరీ ఆవిష్కరణలో భాగంగా మెగాస్టార్ మాట్లాడుతున్న సమయంలో హీరో రాజశేఖర్ పదే పదే అడ్డుపడతూ వేదికపై రచ్చ చేయడంపై చిరు ఫైర్ అయ్యారు. రాజశేఖర్ పైన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఇది ఇలా ఉంటే హీరో మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సన్నివేశం అక్కడికి వచ్చిన అందరిని కడుపుబ్బా నవ్వించింది. సీనియర్ హీరో మోహన్‌ బాబు వేదిక మీద ఉన్న పెద్దలకు స్వాగతం పలుకుతూ కృష్ణంరాజును తాతగారు అంటూ సంబోధించారు. దీంతో మోహన్ బాబు వెనుక ఉన్న చిరు, మోహన్‌ బాబుపై సెటైర్‌ వేయటంతో అంతా నవ్వుకున్నారు.

ఆ తర్వాత మోహన్ బాబు మాట్లాడుతూ.. గతంలో సీనియర్ యాక్టర్స్ కం లెజెండ్స్ ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్‌లు ఒకే వేదికపైన ఉన్నప్పుడు ఒకరిపైన మరొకరు ఛలోక్తులు వేసుకునేవారు. అలాగే చిరంజీవి నేను కూడా అంతేనని, మా ఇద్దరి మధ్య ఉన్న బంధం కూడా అలాంటిదేనని అన్నారు. అయితే మోహన్ బాబు ఇలా మాట్లాడుతూ ఉండగానే చిరు వెనుకనుండి మోహన్ బాబుని గట్టిగా కౌగిలించుకొని బుగ్గలపైన ముద్దు పెట్టాడు.


Web TitleChiranjeevi kisses mohan babu
Next Story