జూన్ 21 కి చిరంజీవికి ఏనలేని సంబంధం ..!

జూన్ 21 కి చిరంజీవికి ఏనలేని సంబంధం ..!
x
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడని ఎవరు ఉండరు .. ఆయనకి బయట ఫాన్స్ మాత్రమే కాదు .. సినిమా ఇండస్ట్రీలో కూడా హార్ట్ కోర్ ఫాన్స్...

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడని ఎవరు ఉండరు .. ఆయనకి బయట ఫాన్స్ మాత్రమే కాదు .. సినిమా ఇండస్ట్రీలో కూడా హార్ట్ కోర్ ఫాన్స్ ఉన్నారు .. మేము సినిమా ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి స్ఫూర్తి అని పలు సందర్బాలలో చాలా మంది హీరోలు చెప్పారు .. మరి చిరంజీవి ఇంతటి స్థాయికి రావడానికి అయన సినిమాలు కారణం .. అందులో అయన నటించిన మొదటి సినిమా పునాదిరాళ్ళుకి ఈ రోజుతో 40 ఏళ్ళు నిండాయి ..

చిరంజీవి సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న సందర్బంలో ఆయనకి హాస్యనటుడు సుధాకర్ మరియు హరిప్రసాద్ లు పరిచయం అయ్యారు .. ఈ క్రమంలో ఎవరి సినిమా ప్రయత్నాలు వారు చేస్తూ ఉండేవారు .. సుధాకర్ కి మాత్రం తమిళ్ లో ఛాన్స్ లు వచ్చేవి .. ఇక చిరంజీవి కూడా పట్టు వదలని విక్రమార్కుడి లాగా తన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండేవాడు ..

ఈ క్రమంలో రాజ్ కుమార్ దర్శకత్వంలో పునాదిరాళ్ళు అనే సినిమాతో చిరంజీవికి మొదటి అవకాశం లభించింది .. ఈ సినిమాతోనే శివ శంకర్ వరప్రసాద్ కాస్తా చిరంజీవిగా మారిపోయాడు .. అయితే చిరంజీవి పేరు పెట్టుకోవడం వెనుక ఉన్న కధను చిరంజీవి ఒక సందర్బంలో వివరించారు .. చిరంజీవి మొదటగా కెమరా ని పేస్ చేసిన సినిమా పునాదిరాళ్ళు అయిన ప్రాణం ఖరీదు సినిమా మొదటగా విడుదలైంది .. అంతే కాకుండా ప్రముఖ నటి రోజా రమణి వందో చిత్రం పునాదిరాళ్ళు కావడం విశేషం ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories