మెగాస్టార్ హీరో మాత్రమే కాదు ... ఓ సినిమాకి పేరు పడని దర్శకుడు కూడా

మెగాస్టార్ హీరో మాత్రమే  కాదు ... ఓ సినిమాకి  పేరు పడని దర్శకుడు కూడా
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి అంటే మనకి ఓ గొప్ప హీరోగా , ఓ గొప్ప డాన్సర్ గానే తెలుసు .. కానీ ఆయనలో దర్శకుడు కూడా ఉన్నారంటే నమ్ముతారా ? అవును అయన ఓ సినిమాలోని...

మెగాస్టార్ చిరంజీవి అంటే మనకి ఓ గొప్ప హీరోగా , ఓ గొప్ప డాన్సర్ గానే తెలుసు .. కానీ ఆయనలో దర్శకుడు కూడా ఉన్నారంటే నమ్ముతారా ? అవును అయన ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించారు .. అది కూడా అయన నటించిన సినిమానే కావడం ఇక్కడ మరో విశేషం ... అదే చిరంజీవి సినిమాలలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచినా గ్యాంగ్ లీడర్ సినిమా ... ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు చిరు దర్శకత్వం వహించారు . ఈ విషయాన్నీ సీనియర్ నటుడు నారయణరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు .

నిజానికి గ్యాంగ్ లీడర్ సినిమాకి విజయ బాపినీడు దర్శకుడు . అయితే అ సినిమా సగం పూర్తి అయ్యాక సినిమా రషెస్ ని చిరు వేసుకొని చూసారు . అనుకున్నంతగా సినిమా రాలేదని చిరు విజయ బాపినీడుకి చెప్పడంతో విజయ బాపినీడు మీరు కూడా ఓ చేయి వేయండి అంటే చిరంజీవి సినిమాలోని కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించారు .

సినిమాలో భాగంగా వచ్చే మురళీమోహన్ ని చంపే సన్నీవేషం, చిరంజీవి స్నేహితులను వెంబడించి చంపే సన్నీవేషాలు చిరునే చిత్రీకరించారని అయన చెప్పుకొచ్చారు . చిరు తెర మీద పేరు పడని దర్శకుడు అని అన్నారు . ఆ సినిమాలో నారయణరావు ఓ పాత్రను పోషించారు . ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories