ఇక ఆ పాత్ర చరణ్ చేయాలి. నా వల్ల కాదు : చిరంజీవి

ఇక ఆ పాత్ర చరణ్ చేయాలి. నా వల్ల కాదు : చిరంజీవి
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా సినిమా తెరకెక్కింది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తే, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు....

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా సినిమా తెరకెక్కింది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తే, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి టాక్ వస్తుంది. సినిమాలో చిరంజీవి నటన బాగుందని అంటున్నారు. ఇక మెగా ఫాన్స్ దసరా పండగ ముందే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే సినిమా విడుదలకి ముందు చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఎప్పటినుండో భగత్ సింగ్ పాత్రను చేద్దామని అనుకున్నానని కానీ అలాంటి కథతో దర్శక నిర్మాతలు నా ముందుకు ఎవరు రాలేదని చిరు అన్నారు. ఇక ఆ పాత్ర చేయలేననే ఫీలింగ్ కలుగుతోందని, భగత్ సింగ్ పాత్రను చరణ్ చేస్తే బాగుంటుందనేది తన అభిప్రాయమని చిరు అన్నారు...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories