అఖీరాకు చిరు బర్త్‌ డే విషెస్.. పవర్‌ఫుల్‌ ఫ్యూచర్‌..

అఖీరాకు చిరు బర్త్‌ డే విషెస్.. పవర్‌ఫుల్‌ ఫ్యూచర్‌..
x
Highlights

మెగాకుటుంబంలో ఇవాళ రెండు వేడుక‌లు జ‌రుగుతున్నాయి, ఒక వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు, మ‌రోవైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమారుడు...

మెగాకుటుంబంలో ఇవాళ రెండు వేడుక‌లు జ‌రుగుతున్నాయి, ఒక వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు, మ‌రోవైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమారుడు అఖీరానంద‌న్ పుట్టిన‌రోజు కావ‌డం విశేషం. కాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడికి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అఖీరాకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. అఖీరాకు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. పవన్ , రేణు దేశాయ్ ల తొలి సంతానం అయిన అఖీరా నందన్.

మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అఖీరానంద‌న్ కి ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 'మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి. విష్ యూ ఏ పవర్ ఫుల్ ప్యూచర్. హ్యాపీ బర్త్ డే అకీరా'అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా అఖీరాను ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చిరంజీవితో పాటు మెగా కుటుంబసభ్యులు, మెగా ఫ్యాన్స్‌ కూడా అఖీరాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories