Unstoppable2 With NBK: నేను చిరు కలిస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది

Chiranjeevi Balakrishna Multistarrer Allu Aravind Opens Up In Unstoppable 2
x

Unstoppable2 With NBK: నేను చిరు కలిస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది

Highlights

Unstoppable With NBK S2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఈమధ్య ప్రేక్షకులను బాగానే ఆకర్షిస్తుంది.

Unstoppable With NBK S2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఈమధ్య ప్రేక్షకులను బాగానే ఆకర్షిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ షో కి అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు మరియు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గెస్ట్‌లుగా విచ్చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. బాలకృష్ణ సురేష్ బాబు గురించి మాట్లాడుతూ తనతో చాలా సినిమాలు చేశానని కానీ మన ఇద్దరి కాంబినేషన్లోనే ఇప్పటిదాకా సినిమా రాలేదని అల్లు అరవింద్ తో అన్నారు.

దీంతో అల్లు అరవింద్ "మీరు మరియు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిపి ఒక సినిమా చేద్దామని ఎదురు చూస్తున్నాను," అని అన్నారు. అప్పుడు బాలకృష్ణ "అయితే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది" అని అన్నారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు కూడా చప్పట్లు కొట్టారు. ఇక రాఘవేంద్రరావు గురించి మాట్లాడుతూ అల్లు అరవింద్ రాఘవేంద్రరావు బిఏ లో బిఏ అంటే బొడ్డుపై ఆపిల్ అంటూ కామెడీ చేశారు.

దీంతో రాఘవేంద్రరావు న్యూటన్ ఆపిల్ పడడంతో గ్రావిటీ కనుక్కున్నారు కానీ నేను ఆ ఆపిల్ ఎక్కడ పడాలో కనుక్కున్నాను అంటూ జోక్ చేశారు. ఇక ప్రోమో చూస్తే ఈ ఎపిసోడ్ చాలా సరదా సరదాగా సాగానుందని తెలుస్తోంది. అంతేకాకుండా "ఆ నలుగురు" లో ఇద్దరు మీరే కదా అంటూ బాలకృష్ణ కూడా కొన్ని ప్రశ్నలు వేశారు మరి వాటికి అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు ఎలా రియాక్ట్ అయ్యారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories