వైరల్ న్యూస్ : చిరంజీవి 152 వ సినిమా కథ అదేనట ...

వైరల్ న్యూస్ : చిరంజీవి 152 వ సినిమా కథ అదేనట ...
x
Highlights

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక చిరంజీవి సినిమాలపై స్పీడ్ పెంచేసారు. ఖైది 150 సినిమా తర్వాత వెంటనే తన డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరాని ప్రేక్షకుల ముందుకు...

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక చిరంజీవి సినిమాలపై స్పీడ్ పెంచేసారు. ఖైది 150 సినిమా తర్వాత వెంటనే తన డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. భారీ బడ్జెట్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇదే ఉపులో చిరంజీవి తన తర్వాత సినిమాని కొరటాల దర్శకత్వంలో మొదలు పెట్టారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న కథ ప్రకారం ఇందులో చిరంజీవి దేవాదయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారట... దేవాలయాల నిర్లక్ష్యం సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయో ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నార‌ని, అంతేకాకుండా ఆలయ భూములను ఆక్రమించటానికి ప్రయత్నించే వారిపై అతను ఎలా చర్యలు తీసుకున్నాడు అన్నది మెయిన్ కథగా సాగనుందట.. మరి అది ఇదేనో కాదో తెలియాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories