చిరంజీవిగానే వర్ధిల్లాలని కోరుకుంటున్నా : చంద్రబాబు

చిరంజీవిగానే వర్ధిల్లాలని కోరుకుంటున్నా : చంద్రబాబు
x
Highlights

మెగా అభిమానులకు ఇదో పండగ రోజు అనే చెప్పాలి .. ఎందుకంటే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడం విశేషం .. అయన పుట్టినరోజు వేడుకలని మెగా అభిమానులు...

మెగా అభిమానులకు ఇదో పండగ రోజు అనే చెప్పాలి .. ఎందుకంటే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడం విశేషం .. అయన పుట్టినరోజు వేడుకలని మెగా అభిమానులు చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు . అయన పుట్టినరోజు సందర్భాంగా కొన్ని చోట్ల కేక్స్ కట్ చేయడం , రక్తదానాలు చేయడం చేస్తున్నారు . ఇక సినీ మరియు రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . అయితే ఈ సందర్భాంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసారు .. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని పోస్ట్ చేశారు చంద్రబాబు ...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories