Top
logo

దేవదాస్ కనకాల మరణం పట్ల పలువురు సంతాపం

దేవదాస్ కనకాల మరణం పట్ల పలువురు సంతాపం
Highlights

టాలీవుడ్ ని మరో విషాదం వెంటాడిది. ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి చెందారు . ఆయన మరణం పట్ల పలువురు సంతాపం...

టాలీవుడ్ ని మరో విషాదం వెంటాడిది. ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి చెందారు . ఆయన మరణం పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు . ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు . "నటుడిగా తాను రాణించిందే కాకుండా, నట శిక్షకునిగా ఎందరినో ఉత్తమ నటులుగా తీర్చిదిద్దిన దేవదాస్ కనకాలగారి మరణం కళారంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, దేవదాస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు "సంతాపం తెలిపారు ..

"తెలుగు సినీ పరిశ్రమకు ఎంతోమంది సుశిక్షితులైన నటీ నటులను అందించిన, నటుడు, దర్శకుడు శ్రీ దేవదాస్ కనకాలగారి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని " నారా లోకేష్ సంతాపం ప్రకటించారు ." దేవదాసు కనకాల గారి మరణం బాధాకరం. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ లోటును తట్టుకునే శక్తి కుటుంబసభ్యులకు కలిగించాలని భగవంతున్ని కోరుకుంటున్నానని" సీఎం రమేష్ తెలిపారు ..

Next Story