బాలకృష్ణ సరసన క్యాథరిన్ ?

బాలకృష్ణ సరసన క్యాథరిన్ ?
x
Balakrishna, Catherine tresa
Highlights

పక్కా మాస్ ఎలిమెంట్స్ తో సినిమాలు తెరకేక్కిస్తుంటాడు దర్శకుడు బోయపాటి.

పక్కా మాస్ ఎలిమెంట్స్ తో సినిమాలు తెరకేక్కిస్తుంటాడు దర్శకుడు బోయపాటి. సినిమాలలో హీరోలతో పాటు హీరోయిన్స్ పాత్రలకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇప్పటి వరకూ బోయపాటి సినిమాలో రెండు సార్లు రిపీట్ అయిన హీరోయిన్స్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారు నయనతార, రకుల్ ప్రీత్ మాత్రమే. తుల‌సి, సింహా సినిమాల్లో నయనతారని, సరైనోడు, జయ జానకి నాయక చిత్రాల్లో రకుల్ ని రిపీట్ చేశాడు బోయపాటి శ్రీను. ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ క్యాథరిన్ కూడా చేరబోతుందని వార్తలు వస్తున్నాయి.

బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా.. వచ్చే నెలలో సినిమా పట్టాలేక్కనుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా క్యాథరిన్ ని తీసుకోవాలని అనుకుంటున్నాడట బోయపాటి. గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో నటించింది ఈ భామ..అంతేకాకుండా జయ జానికి నాయకా సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది.

ఇప్పుడు బోయపాటి సినిమాలో హీరోయిన్ గా క్యాథరిన్ నటించాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో మొన్నటివరకు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి కేవలం అవాస్తవాలని చెప్పుకొచ్చింది సోనాక్షి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

ఇక ప్రస్తుతం బాలయ్య నటించిన రూలర్ చిత్రం రేపు(శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కే. యస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ నిర్మించారు. బాలకృష్ణ సరసన వేదిక, సోనాలి చౌహాన్ లు నటించారు. జై సింహ సినిమా తర్వాత బాలకృష్ణ. కే. యస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories