బొగ్గుగని శీనుతో కేథరిన్

బొగ్గుగని శీనుతో కేథరిన్
x
WFL
Highlights

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'.. ఈ మూవీలో విజయ్ సరసన ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసా

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'.. ఈ మూవీలో విజయ్ సరసన ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసా, రాశీఖ‌న్నాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ని ఇప్పటికే స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఐశ్వర్యా రాజేష్, ఇజా బెల్లాలకి సంబంధించిన లూక్స్ ని విడుదల చేశారు. తాజాగా కేథరిన్ తో లుక్‌ను ఈరోజు డిసెంబర్ 14న 6:03 గంటలకు విడుదల చేశారు.

ఇందులో కేథరిన్ స్మిత మేడమ్‌గా కనిపించనుంది. బొగ్గుగనిలో పనిచేసే యూనియన్ లీడర్ శీను ప్రేమలో స్మిత మేడమ్ ఎలా పడిందన్న కోణంలో వీరి మధ్య లవ్ ట్రాక్ ఉండనుంది. ఇక మిగిలన రాశీఖన్నా లుక్ ని రేపు అనగా డిసెంబర్ 15న 6:03 గంటలకు విడుదల చేయనున్నారు. క్రాంతిమాధ‌వ్ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని కే. యస్ వల్లభ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ఐశ్వర్యా రాజేష్‌ , ఇజాబెల్లా లూక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల చేసిన లూక్స్ సినిమాపైన మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని పూరి, చార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుందని సమాచారం. ఈ సినిమాతోనే విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories