ప్రేక్షకుడి బుర్రకి ఎక్కని బుర్రకథ : రివ్యూ ..

ప్రేక్షకుడి బుర్రకి ఎక్కని బుర్రకథ : రివ్యూ ..
x
Highlights

ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సాయి కుమార్ తనయుడు ఆది తర్వాత అదే జోష్ ని మాత్రం కొనసాగించలేకపోయాడు .....

ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సాయి కుమార్ తనయుడు ఆది తర్వాత అదే జోష్ ని మాత్రం కొనసాగించలేకపోయాడు .. మధ్యలో కొన్ని సినిమాలు ఒకే అనిపించినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేదు . ఈ సారి బుర్రకథ అంటూ మన ముందుకు వచ్చాడు .. మరి ఆది ఈ కథతో అయిన మెప్పించాడో లేదో మన సమీక్షలో చూద్దాం ..

కథ : -

అభిరామ్ ( హీరో ) పుట్టడమే రెండు మెదళ్లతో పుడతాడు .. అందులో ఒకరు అభి కాగా మరొకరు రామ్.. ఇద్దరికీ వేరు వేరు గోల్స్ ఉంటాయి . ఇద్దరి ఆలోచన వైఖరిలో కూడా తేడా ఉంటుంది .అయితే తానూ పెరుగుతున్న క్రమంలో తనలో ఇద్దరు ఉన్నారని తెలుస్తుంది . దీనితో ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది . కానీ ఒకానొక దశలో ఇద్దరు ఒకేలా ఆలోచించడం మొదలు పెడతారు . అయితే దీనికి గల కారణం ఏంటి ? వీరు ఇలా మారడానికి ఏర్పడ్డ సంఘటనలు ఏంటి అన్నది తెరేపైన చూసి తెలుసుకోవాల్సిందే ..

విశ్లేషణ : -

సినిమాపైనే దర్శకుడు మనకు ముందే క్లారిటీ ఇచ్చేసాడు . ఒక ఫోన్ లో రెండ సిమ్ లు ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఒక మనిషిలో రెండు బుర్రలు ఉంటే ఎలా ఉంటుంది అని సాగే కథనమే ఈ కధ అని .. నిజానికి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కి ముందు వావ్ అనాల్సిందే .. కానీ దానికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు .. కథ ఎలా ఉన్నప్పటికీ సన్నివేశాల్లో కొత్తదనం చూపించినప్పుడే ప్రేక్షకుడని సినిమా మరింత రక్తి కట్టిస్తుంది . సినిమా మొదటి నుండే దర్శకుడు చాలా కంగారు పెట్టేస్తూ అయోమయంలో పడేస్తాడు . ఇక సినిమాకి ప్రధానం కామెడి అనే చెప్పాలి . అభి రామ్ వెంటవెంటనే చేంజ్ అవుతూ తమ నిర్ణయాలు చేంజ్ చేసుకునే క్రమంలో హాస్యం బాగా పండింది అనే చెప్పాలి , సినిమాలో మొదటి భాగం ఒకే అనిపించినప్పటికీ రెండో భాగం మాత్రం నత్తనడకతో సాగింది . కొన్ని ఎమోషన్ సీన్స్ స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు వాటి జోలికి వెళ్ళలేదు ..యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి ..

నటినటులు - సాంకేతిక వర్గం

రెండు విభిన్న పాత్రల్లో ఆది చాలా చక్కగా నటించాడు . ముఖ్యంగా తన కామెడి టైమింగ్ సూపర్బ్ .. ఇక ఎప్పటిలాగే ఫైట్స్, డాన్స్ లలో ఇరకోట్టాడు .. ఇక హీరోయిన్ పాత్ర సినిమా పాటలకు మాత్రమే పరిమితం అయింది . రాజేంద్రప్రసాద్, పోసాని , పృద్వీ తమ నటనతో ఆకట్టుకున్నారు . ఇక రచయిత నుండి దర్శకుడిగా మారినా డైమండ్ రత్నం రచయితగా సక్సెస్ అయినప్పటికీ దర్శకుడిగా కథకు తగ్గ న్యాయం చేయలేదనే చెప్పాలి.. సాయి కార్తీక్ సంగీతం ఒకే అనిపించింది . నిర్మాణ విలువలు బాగున్నాయి ..

చివరగా : -

రెండు బుర్రలు ఒక్క ప్రేక్షకుడి బుర్రని మెప్పించలేకపోయింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories