ఫ్యామిలీతో బన్నీ కూల్..కూల్ గా..

ఫ్యామిలీతో బన్నీ కూల్..కూల్ గా..
x
Highlights

హాట్ హాట్ సమ్మర్ లో సరదాగా కుటుంబంతో చల్లని ప్రదేశాల్లో తిరగడాన్ని ఇష్టపడతారు మన హీరోలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు అదే పనిలో ఉన్నాడు. భార్యా...

హాట్ హాట్ సమ్మర్ లో సరదాగా కుటుంబంతో చల్లని ప్రదేశాల్లో తిరగడాన్ని ఇష్టపడతారు మన హీరోలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు అదే పనిలో ఉన్నాడు. భార్యా పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్ లో కూల్ కూల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మంచుకొండల్లో భార్య స్నేహా రెడ్డి, పిల్లలు యాన్, అర్హలతో కల్సి వున్న ఫోటోలను అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నాడు.

భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి నవ్వుతున్న ఫోటోను షేర్ చేసిన బన్నీ, 'లైఫ్‌లో ఎలా ఉండాలి? అనే దానికి వారు 'ఆనందంగా' అని చెప్పారు' అని పోస్ట్ పెట్టాడు. అయాన్‌ను స్ట్రోలర్‌పై తీసుకెళ్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ 'డాడీ కూల్‌' అని రాశాడు.

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకి సిద్ధం అయిన బన్నీ ఈ లోపు రీఛార్జ్ అవ్వడానికి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఫోటోలకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories