బోయపాటి సినిమాలో అఘోరగానే బాలయ్య.. కానీ కాస్తా కొత్తగా!

బోయపాటి సినిమాలో అఘోరగానే బాలయ్య.. కానీ కాస్తా కొత్తగా!
x
Boyapati Srinu(File photo)
Highlights

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది..

అయితే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అందులో ఒకటి మామూలు పాత్ర కాగా మరొకటి ఆఘోర పాత్ర అని టాలీవుడ్ సర్కిల్లో న్యూస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా దీనిపైన దర్శకుడు బోయపాటి స్పందించారు..నిన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న చిత్ర విశేషాలు గురించి వెల్లడించారు..

బాలయ్య ఈ సినిమాలో ఓ పాత్రలో అఘోరగా కనిపిస్తాడని అద్భుతమైన నేపథ్యంతో ఆ పాత్రకు ఉంటుందనీ బోయపాటి వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని వెల్లడించారు. సింహా లెజెండ్ సినిమాల తరవాత మా కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని అంతకుమించి ఈ సినిమా ఉంటుందని బోయపాటి వెల్లడించారు.

బాలకృష్ణ తో సినిమా అంటే దర్శకులు కథ డైలాగ్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు అని కాని నేను బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ గురించి ఆలోచిస్తానని బోయపాటి వెల్లడించారు. అందులో భాగంగానే సింహా సినిమాను 20 నిమిషాల్లో, లెజెండ్ కూడా అంతే. 20-25 నిమిషాల్లో ఓకే చేయించుకున్నాను. ఆయనలో ఉన్న క్వాలిటీ అదేనని కొత్తదనాన్ని బాలయ్య ఎంకరేజ్ చేస్తారని బోయపాటి చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories