రూలర్ టైటిల్ నాదే : బోయపాటి

రూలర్ టైటిల్ నాదే : బోయపాటి
x
Boyapati sreenu
Highlights

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం `రూల‌ర్‌`. కె.ఎస్‌.ర‌వికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం `రూల‌ర్‌`. కె.ఎస్‌.ర‌వికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నిన్న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న బోయపాటి శ్రీను సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు..

ఆ తర్వాత బోయపాటి మాట్లాడుతూ.. " రూల‌ర్ టైటిల్ నాదేదేన‌ని, బాల‌కృష్ణకు సూట్ అయ్యే టైటిల్ రూల‌ర్ అని చెప్పుకొచ్చారు. ఆయ‌న కోసం ఈ టైటిల్‌ను రిజిష్టర్ చేయించాన‌ని, టైటిల్‌తో పాటు ఓ సాంగ్‌ను కూడా రికార్డింగ్ చేయించుకున్నట్టు బోయపాటి చెప్పుకొచ్చారు.

ఇక రూలర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారు. బాలకృష్ణ సరసన వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత బోయపాటితో ఓ సినిమాని చేయనున్నారు బాలకృష్ణ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి సినిమాలు వచ్చి మంచి హిట్టయ్యాయి. జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories