logo

బాలయ్య స్టైలిష్ లుక్ వెనుక సిక్రెట్ అదేనట...

బాలయ్య స్టైలిష్ లుక్ వెనుక సిక్రెట్ అదేనట...
Highlights

బాలకృష్ణ మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం బాలకృష్ణ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో...

బాలకృష్ణ మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం బాలకృష్ణ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు . జై సింహ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా ఇదే .. ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు .ఇందులో బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు . వినాయకచవితి సందర్భంగా సినిమాకి సంబంధించి బాలకృష్ణ లుక్ ని విడుదల చేసారు . ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు . ఇక బాలయ్య సరసన సోనాలి చౌహాన్ , వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు . ఈ సినిమాలో బాలయ్య చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడానికి దాని వెనుకున్న సిక్రెట్ ని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను బయటపెట్టారు . ఆయన జిమ్ లో రోజుకు అయిదు గంటలు కష్టపడి 11 కేజీలు తగ్గరట... ఓ సినిమా ఆడియో వేడుకకి వచ్చిన బోయపాటి బాలయ్య న్యూ లుక్ సిక్రెట్ ని బయటపెట్టారు .


లైవ్ టీవి


Share it
Top