బోయపాటితో బాలయ్య మూడో సినిమా ఫిక్స్ ...

బోయపాటితో బాలయ్య మూడో సినిమా ఫిక్స్ ...
x
Highlights

మాస్ దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణ కాంబినేష‌న్ లో ఓ సినిమా ఉంటుందని గతకొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కాంబినేష‌న్ పై ...

మాస్ దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణ కాంబినేష‌న్ లో ఓ సినిమా ఉంటుందని గతకొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కాంబినేష‌న్ పై అధికారిక ప్రకటన వెలువడింది... ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా వెల్లడించారు . వినయ విధేయ రామ సినిమాతో ఫ్లాప్ ని చూసిన బోయపాటి బాలకృష్ణ కోసం పక్కా మాస్ తో కూడిన ఓ కథను సిద్దం చేసారట.. ఈ సినిమాని మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టి వచ్చే ఏడాది వేసవిలో సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన ఇతర నటినటులను మరియు సాంకేతిక నిపుణులను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది . ఇప్పటికే బోయపాటి బాలకృష్ణతో సింహ, లెజెండ్ లాంటి సినిమాలు తీసి బ్లాక్ బాస్టర్ హిట్లను కొట్టాడు. ఈ సినిమాతో కూడా మంచి హిట్టు కొట్టి హైట్రిక్ కొట్టాలని బోయపాటి కసిమీదా ఉన్నాడు . ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories