ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట కరోనా కలకలం..!

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట కరోనా కలకలం..!
x
Highlights

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నివాసంలో కరోనా కలకలం రేగింది. బోనీ కపూర్‌ నివాసంలో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడికి నిర్వహించిన కరోనా వైరస్‌...

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నివాసంలో కరోనా కలకలం రేగింది. బోనీ కపూర్‌ నివాసంలో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడికి నిర్వహించిన కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా ఫలితం వచ్చింది‌. తన ఇంట్లో పనిచేసే చరణ్‌ సాహూ శనివారం అస్వస్థతకు గురవడంతో కరోనా నిర్దారణ పరీక్షలకు పంపిన బోనీకపూర్‌. ప్రస్థుతం అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. టెస్టుల్లో పాజిటివ్ రావడంతో ముంబై కార్పోరేషన్ అధికారులు అతన్ని క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. కాగా తాను, తన కుమార్తెలు, ఇంట్లో ఉన్న ఇతర సిబ్బంది అందరం బాగానే ఉన్నామని, తమకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని బోనీకపూర్‌ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories