రిషి కపూర్ సినీ ప్రస్థానం!

రిషి కపూర్ సినీ ప్రస్థానం!
x
Rishi Kapoor(File Photo)
Highlights

బాలీవుడ్ కి సినీ రంగానికి మరో షాక్ తగిలింది.. అగ్ర కథానాయకుడు ఇర్ఫాన్ ఖాన్ చనిపోయి 24 గంటలు గడవకముందే బాలీవుడ్ మరో నటుడు రిషి కపూర్ (67) మృతి చెందాడు.

బాలీవుడ్ కి సినీ రంగానికి మరో షాక్ తగిలింది.. అగ్ర కథానాయకుడు ఇర్ఫాన్ ఖాన్ చనిపోయి 24 గంటలు గడవకముందే బాలీవుడ్ మరో నటుడు రిషి కపూర్ (67) మృతి చెందాడు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అయన ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ అయన చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఈ విషయాన్ని అమితాబ్‌ బచ్చన్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు బాలీవుడ్‌ ప్రముఖులు రిషీకపూర్‌ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

రిషి కపూర్ అనేక తరాలకు చెందిన ఒక చలనచిత్ర రాజవంశానికి చెందినవారు. అయన తండ్రి రాజ్ కపూర్ భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన నటులలో, చిత్రనిర్మాతలలో ఒకరు. రిషి కపూర్ 1952లో సెప్టెంబర్ 04 న బొంబాయిలోని చెంబూర్లోని పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఎక్కువ చదువుకొని రిషి కపూర్ సినిమాలవైపు ఆసక్తి చూపారు. 1970లో తన తండ్రి హీరోగా వచ్చిన "మేరా నామ్ జోకర్" సినిమాతో ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో తన తన తండ్రి చిన్నప్పటి పాత్రను పోషించారు. ఇక 1973 లో వచ్చిన 'బాబీ' సినిమాతో హీరోగా డింపుల్ కపాడియా సరసన నటించారు. ఈ సినిమాకి గాను బెస్ట్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు.. ఇక 2012లో వచ్చిన అగ్నిపత్ లో అయన చేసిన ప్రతి-వింత పాత్రకు గాను ధీ టైమ్స్ అఫ్ ఇండియా నుంచి ఉత్తమ నటుడుగా అవార్డు కూడా దక్కింది.

హమ్ కిసి సే కుమ్ నహిన్, బడాల్టే రోష్టే, ఆప్ కే దీవానే, సాగర్, చాండ్ని, దీవానా, డామిని, గురుదేవ్ వంటి చిత్రాలు ఆయనకి మంచి పేరును తీసుకు వచ్చాయి. ఇక తనతో కలిసి 15 సార్లు జోడి కట్టిన నీతు సింగ్‌ను రిషి కపూర్ 22 జనవరి 1980 న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చెంబూర్‌లోని ప్రతిష్టాత్మక బాంబే ప్రెసిడెన్సీ గోల్ఫ్ క్లబ్‌ లో చాలా గొప్పగా జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో కుమారుడు అయిన రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇక కూతురు రిద్దిమా కపూర్ సహాని డిజైనర్ గా కొనసాగుతున్నారు. రిషి కపూర్ కి రణధీర్ కపూర్ మరియు రాజీవ్ కపూర్ అనే సోదరులు ఉన్నారు. ఇక బాలీవుడ్ నటీమణులు అయిన కరిష్మా కపూర్ మరియు కరీనా కపూర్ రిషి కపూర్ కి మేనకోడల్లు కావడం విశేషం.. ఇక రిషి కపూర్ 2019లో వచ్చిన ది బాడీ చిత్రంలో నటించారు. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా కనిపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories