బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న బట్టతల "బాలా"

Bala Movie
x
Bala Movie
Highlights

సినిమాలో కొత్తదనం ఉండి నవ్వించగలగాలి కానీ ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో బాలా సినిమా కూడా అలాగే...

సినిమాలో కొత్తదనం ఉండి నవ్వించగలగాలి కానీ ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో బాలా సినిమా కూడా అలాగే ఉంది. బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో నటించాడు. ఇప్పుడు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబడుతుంది. నవంబర్ 07 న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పడుతున్నారు. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా బట్టతలతో భాదపడుతున్న యువకుడి పాత్ర్రలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా బట్టతలను కవర్ చేసేందుకు హీరో చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాయి.

మొదటిరోజు ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరిని ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ఈ సినిమాలో భూమి పడ్నేకర్‌, యామీ గౌతమ్‌ హీరోయిన్లుగా నటించారు. అమర్‌ కౌశక్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు ఇటు విమర్శకులను సైతం మెప్పించి రికార్డుల వైపు దూసుకుపోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories