బాలకృష్ణ, బోయపాటి సినిమాలో బాలీవుడ్ భామ

బాలకృష్ణ, బోయపాటి సినిమాలో బాలీవుడ్ భామ
x
బాలకృష్ణ, బోయపాటి శీను
Highlights

దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణ కాంబినేషన్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు ఉంటాయి.

దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణ కాంబినేషన్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు ఉంటాయి. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు మంచి హిట్టు అయి భారీ వసూళ్లను రాబట్టాయి. అంతకుమించి అప్పటికే చాలా ప్లాప్ లలో ఉన్న బాలకృష్ణకి మంచి ఉరటని ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతుంది, ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది.

బోయపాటి బాలకృష్ణ నుంచి మూడో సినిమా కావడంతో ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందులో భాగంగా చిత్రానికి బాలీవుడ్ హంగులు అద్దే ప్రయత్నంలో ఉన్నారట. అయితే సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా సొనాక్షి సిన్హాను తీసుకోవాలని భావిస్తున్నారట. దీనికోసం ప్రయత్నాలు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. అంతేకాకుండా విలన్ గా సంజయ్ దత్తుని తీసుకోవాలని అనుకుంటున్నారట.. ఇవ్వన్ని ఒకే అయితే సినిమాకి బాలీవుడ్ మెరుపులు భారీగా ఉండే అవకాశం ఉంది.

సింహ, లెజండ్ సినిమాలలో లాగేనే ఇందులో కూడా బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇందులో మరొక హీరోయిన్ గా వేదిక నటిస్తుంటే, జబర్దస్త్ యాంకర్ రష్మి ఓ ప్రధాన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ రూలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించారు, గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జై సింహ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక రూలర్ లో బాలయ్య సరసన వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. క్రిస్మస్ సందర్బంగా ఈ సినిమాని డిసెంబర్ 20 న విడుదల చేస్తున్నారు. సీ కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించగా, చిరంతన్ భట్ సంగీతం అందిచాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories