హాట్స్ ఆఫ్ సోనూసూద్ : రీల్ లైఫ్ లో రియల్ హీరో

హాట్స్ ఆఫ్ సోనూసూద్ : రీల్ లైఫ్ లో రియల్ హీరో
x
Sonu Sood (File Photo)
Highlights

సోనూసూద్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. ఎక్కువగా విలన్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు..

సోనూసూద్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. ఎక్కువగా విలన్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.. ఇక అరుంధతి సినిమాలో చేసిన ప‌శుప‌తిగా చేసిన నటన అందరిని కట్టిపడేసింది. అయితే రీల్ లైఫ్ లో విలన్ రోల్ పోషించే సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు.

ప్రస్తుతం కరోనాని అరికట్టడానికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ప్రజలు ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలకి సహకారం అందించాలని కోరాయి. ఇక డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. కరోనా పై వైద్య సిబ్బంది చేస్తున్న సహకారానికి దేశం మొత్తం ఇప్పుడు సలాం అంటుంది. వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు సోనూసూద్ ముందుకు వచ్చాడు.

ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న తన హోటల్ ని ఇచ్చేశాడు. కరోనా వైరస్ భాదితులకి చికిత్స అందించడానికి వైద్య సిబ్బంది వాళ్లు ఎక్కడినుంచో వచ్చి ఉంటారు.. వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. వారు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి. అందుకు మా హోటల్‌ను వినియోగించుకోవాలని, తన హోటల్‌ ఇలా ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందని సోనూసూద్ తెలిపాడు.

సోనూసూద్ చేసిన ఈ సహాయానికి సోషల్ మీడియాలో నెటిజన్స్ అభినందిస్తున్నారు. రీల్ స్క్రీన్ లో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో నిజమైన హీరో నువ్వు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక కరోనా పై పోరాటానికి అన్ని ఇండస్ట్రీలోని వారు మద్దతు తెలుపుతూ విరాళాలను ప్రకటిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories