విజయ్‌ సేతుపతి అవుట్ బాబీ సింహా ఇన్?

విజయ్‌ సేతుపతి అవుట్ బాబీ సింహా ఇన్?
x
Bobby Simha, Allu Arjun, Vijay Sethupathi
Highlights

అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కమ్ టైటిల్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పక్ నారాయణగా నటిస్తున్నట్లు సమాచారం.. గంధపు చెక్కల స్మగ్లింగ్ ఈ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది.. సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అయితే ఈ సినిమా నుంచి తమిళ హీరో విజయ సేతుపతి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే... కాగా ఇటీవల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్‌ సేతుపతి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ అధికారులు చాలా మంది తమిళులను స్మగ్లర్లు అని భావించి కాల్చి చంపిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న నేపధ్యంలో ఈ పాత్రలో నటిస్తే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతని స్థానంలో మరో తమిళ నటుడు బాబీ సింహా ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట.. దీనిపైన అధికార ప్రకటన త్వరలో వెలువడనుంది.

ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories