బ్రహ్మానందంకు బిత్తిరిసత్తి గ్రీన్‌ ఛాలెంజ్‌

bithirisathi
x
bithirisathi
Highlights

రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ మొక్కని నాటి నటుడు బిత్తిరిసత్తికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

గ్రీన్ ఛాలెంజ్ లో సినీ ప్రముఖులు చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఇందులో పాల్గొని మొక్కని నాటి తోటి నటులను మొక్కని నాటలని కోరుతున్నారు. అందులో భాగంగానే తాజాగా బిత్తిరి సత్తి కూడా పాల్గొని మొక్కని నాటాడు. రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ మొక్కని నాటి నటుడు బిత్తిరిసత్తికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. దీనిని స్వీకరించిన సత్తి మూడు మొక్కలను నాటాడు.

అనంతరం బ్రహ్మానందం, కల్వకుంట్ల హిమాన్షురావు, ప్రియదర్శి, బిగ్ బాస్ ఫేం శివజ్యోతికి మొక్కలు నాటాలని హరిత సవాల్ విసిరాడు. ఇందులో నటుడు బ్రహ్మానందంకి ఓ మొక్కను అందజేశాడు సత్తి.. ఈ సందర్భంగా సత్తి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎంపీ సంతోష కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని కొనియాడారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని బిత్తిరిసత్తి విజ్ఞప్తి చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories