అ రెండు సినిమాలు రమ్యకృష్ణని స్టార్ ని చేసాయి...

అ రెండు సినిమాలు రమ్యకృష్ణని స్టార్ ని చేసాయి...
x
Highlights

ఆమె సినిమాల్లో ఉందంటే సినిమా ఫ్లాప్ అని అప్పట్లో ఓ సెంటిమెంట్... కానీ అ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ ఆమె ఉంటే సినిమాకి పెద్ద బలం అనే రేంజ్ కి...

ఆమె సినిమాల్లో ఉందంటే సినిమా ఫ్లాప్ అని అప్పట్లో ఓ సెంటిమెంట్... కానీ అ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ ఆమె ఉంటే సినిమాకి పెద్ద బలం అనే రేంజ్ కి ఎదిగిపోయింది రమ్యకృష్ణ.. తన అందం, అభినయంతో మెప్పించింది రమ్యకృష్ణ... చాలా చిన్న వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా రమ్యకృష్ణకి మొదటగా అని ఫ్లాప్ సినిమాలే ఎదురయ్యాయి. 1985 లో వచ్చిన ఇద్దరు మిత్రులు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది రమ్యకృష్ణ.. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూత్రధారులు' సినిమాతో నటిగా మంచి గుర్తింపు వచ్చింది.

ఇక 1990లో దర్శకుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన 'అల్లుడుగారు' సినిమాతో హీరోయిన్‌గా రమ్యకృష్ణకు పెద్ద బ్రేక్ లభించింది. ఇక అప్పటినుండి ఆమె మళ్ళీ వెనుకకి తిరిగి చూసుకున్నది లేదు... అయన దర్శకత్వంలో అత్యధిక సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది రమ్యకృష్ణనే కావడం విశేషం . ఇక రజినీకాంత్‌తో నటించిన 'నరసింహా' సినిమాలో నీలాంబరి పాత్రలో రజీనికాంత్ కి పోటాపోటీగా నటించి శభాష్ అనిపించుకున్నారు రమ్యకృష్ణ. అ సినిమా ఆమెని తిరుగులేని స్టార్ ని చేసింది. ఈ రెండు సినిమాలు రమ్యకృష్ణని టాప్ హీరోయిన్ ని చేసాయి.

1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో స్టార్ హీరోలతో ఆమె కలిసి నటించింది. ఇక తెలుగు దర్శకుడు అయిన కృష్ణవంశీని ఆమె వివాహం చేసుకున్నారు . వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో ఆమె నటించిన పెద్దగా పేరును తీసుకురాలేదు. ఇక దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. శివగామి పాత్రలో ఆమె చేసిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. రమ్యకృష్ణ ఇలాంటి సినిమాలు, పాత్రలు మరెన్నో చేయాలనీ కోరుకుంటూ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది హెచ్ఎంటీవీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories