Top
logo

రాహుల్ మిస్ యూ : పునర్నవి

rahul sipligunj punarnavi
X
rahul sipligunj punarnavi
Highlights

ఇక రాహుల్ ప్రస్తుతం తన సినిమా పాటలతో బిజీగా ఉన్నాడు. అతను మిస్ అయిన రాములో రాములో సాంగ్ ని మళ్ళీ పాడించాలని అయన అభిమానులు కోరుతున్నారు.

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 అయిపోయి చాలా రోజులు అయిపోయినప్పటికి హౌస్ లోని కంటెస్టెంట్స్ మాత్రం చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇంటర్వ్యూలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలుస్తూ పార్టీలు చేసుకుంటున్నారు. తాజాగా వీరందరూ కలిసి పార్టీ చేసుకున్నారు.

గ‌త రాత్రి మ‌హేష్‌, పునర్నవి, వితికా, హిమ‌జ‌,వ‌రుణ్‌, అలీ, అత‌ని భార్య మ‌సుమా రీ యూనియ‌న్ పార్టీ చేసుకున్నారు. క‌ల‌ర్ ఫుల్ డ్రెస్‌లో ఫుల్ సంద‌డి చేశారు. ఇందులో బిగ్ బాస్ 3 విజేత రాహుల్ మిస్ అయ్యాడు. దీనితో పునర్నవి రాహుల్ మిస్ యూ అంటూ పోస్ట్ పెట్టింది. వీరు చేసుకున్న పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక రాహుల్ ప్రస్తుతం తన సినిమా పాటలతో బిజీగా ఉన్నాడు. అతను మిస్ అయిన రాములో రాముల సాంగ్ ని మళ్ళీ పాడించాలని అయన అభిమానులు కోరుతున్నారు. తాజాగా రాహుల్ కార్తికేయ హీరోగా నటిస్తున్న 90 ml సినిమాలో సింగిల్ సింగిల్ అంటూ ఓ పాట పాడాడు. ఈ పాటకి శ్రోతలనుంచి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది .Web TitleBiggboss 3 team celebrate reunion party
Next Story